Home   »  వార్తలుఉద్యోగంజాతీయం   »   శిక్షణ పేరుతో చిత్రహింస..జూనియర్లను చితకబాదిన NCC సీనియర్‌ విద్యార్థి..

శిక్షణ పేరుతో చిత్రహింస..జూనియర్లను చితకబాదిన NCC సీనియర్‌ విద్యార్థి..

schedule yuvaraju

మహారాష్ట్ర: ట్రైనర్‌నన్న నెపంతో 8 మంది జూనియర్లను ఓ సీనియర్ NCC క్యాడెట్ చితకబాదిన ఘటన థానేలోని బందోద్కర్ కాలేజీలో చోటుచేసుకుంది. శిక్షణ పేరుతో చితక్కొట్టి, జూనియర్ విద్యార్థులపై తన ప్రతాపం చూపి, కసితో ఊగిపోయాడు. సీనియర్లతో కలిసి జూనియర్లను ప్లాస్టిక్ పైప్‌తో ఇష్టం వచ్చినట్లుగా కొట్టేశాడు. ఈ సీనియర్ ఎంతకాలంగా ఇలా చేస్తున్నాడో తెలియదు కానీ ఎన్‌సీసీ క్యాడెట్ ఓ యువకుడిని కొడుతున్న దృశ్యాన్ని ఓ కాలేజీ విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో బంధించిన వీడియో వైరల్ అవడంతో, జూనియర్లపై సీనియర్ చేస్తున్న దాడి వెలుగులోకి వచ్చింది. ట్రైనింగ్ సమయంలో తాను చెప్పినట్టు చేయనందుకే జూనియర్లకు ఇలాంటి శిక్ష విధించాడని అంటున్నారు.

జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో పుష్-అప్ పొజిషన్ చేయమని ఆదేశించాడు. ఆపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడం మొదలు పెట్టాడు. జూనియర్ NCC విద్యార్థులు బాధతో అరిచినా సీనియర్ వదలకుండా ప్లాస్టిక్ పైప్‌తో కొట్టడం, శారీరకంగా హింసించడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనను చాలా మంది ఖండించారు. శిక్షణ పేరుతో ఇలా చేయడం శిక్షార్హమని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.