Home   »  వార్తలుక్రీడలు   »   US Open 2023 |యూఎస్‌ ఓపెన్‌-2023 విజేత జకోవిచ్‌

US Open 2023 |యూఎస్‌ ఓపెన్‌-2023 విజేత జకోవిచ్‌

schedule mahesh

US OPEN 2023: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ టైటిల్‌ను టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ జకోవిచ్‌ నాలుగో సారి సొంతం చేసుకున్నాడు. యూఎస్‌ ఓపెన్‌ -2023 (US Open -2023) మెన్స్‌ సింగిల్‌ విజేతగా నిలిచాడు.

జకోవిచ్‌ రష్యాదిగ్గజం మెద్వెదేవ్‌ను ఫైనల్‌లో వరుస సెట్లలో 6-3, 7-6, 7-5, 6-3 తేడాతో చిత్తుగా ఓడించాడు.

ఫలితంగా సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన మార్గరెట్ కోర్టు(24) పేరిట ఉన్న రికార్డును జకోవిచ్‌ సమం చేశాడు.

దీంతో కెరీర్‌లో 24వ గ్రాండ్‌ స్లామ్‌ (24th Grand Slam) టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్‌ సాధించిన ఆటగాడిగా జకోవిచ్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సెరేనా విలియమ్స్(23)ను అధిగమించాడు. మరో టైటిల్ సాధిస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా జకోవిచ్‌ రికార్డు సృష్టించనున్నాడు.

తాజాగా న్యూయార్క్‌లోని ఆర్థర్‌ ఆషే స్టేడియంలో జరిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో రష్యా ఆటగాడు మెద్వెదెవ్‌ (Medvedev)ను చిత్తుచేసి 24వ గ్రాండ్‌ స్లామ్‌ను ముద్దాడాడు.

US OPEN మహిళల డబుల్స్ విజేత

కెనడా క్రీడాకారిణి గాబ్రియేలా డబ్రోవ్‌స్కీ, న్యూజిలాండ్ క్రీడాకారిణి ఎరిన్ రౌట్‌లిఫ్ జోడీ ఆదివారం జరిగిన యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో మాజీ ఛాంపియన్ జర్మనీకి చెందిన లారా సీజెమండ్, రష్యాకు చెందిన వెరా జ్వోనరేవా జోడీని 7-6(9), 6-3తో ఓడించి విజేతగా నిలిచింది.

US OPEN పురుషల డబుల్స్ విజేత

ఆర్థర్ యాష్ స్టేడియంలోని హార్డ్ కోర్ట్‌ల పై పోటీపడుతున్న ఆరో సీడ్ రోహన్ బోపన్న, మాథ్యూ ఎడ్బెన్ జోడీ సరిగ్గా రెండు గంటల్లో 6-2, 3-6, 4-6తో మూడో సీడ్ రాజీవ్ రామ్, జో సాలిస్‌బరీ చేతిలో ఓడిపోయారు.

ఈ విజయంతో రాజీవ్ రామ్, జో సాలిస్‌బరీ US ఓపెన్‌లో 90 సంవత్సరాలకు పైగా మూడు-ఫీట్ లు సాధించిన మొదటి పురుషుల డబుల్స్ జట్టుగా నిలిచారు.