Home   »  వార్తలుతెలంగాణ   »   జగిత్యాల నుంచి జన్నారం వైపు వెళ్లే వాహనాల రాకపోకలు బంద్..

జగిత్యాల నుంచి జన్నారం వైపు వెళ్లే వాహనాల రాకపోకలు బంద్..

schedule mounika

జగిత్యాల నుంచి జన్నారం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను అధికారులు శనివారం ఉదయం నిలిపివేశారు. వంతెన నిర్మాణంలో ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అప్రోచ్ రోడ్డు వరద కోతకు గురై కొన్ని రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. తాత్కాలికంగా మళ్ళీ పైపులు వేసి మట్టి పోయడంతో రాకపోకలు మొదలయ్యాయి. మళ్లీ నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఉదయం వరద ఎక్కువగా రావడంతో రాకపోకలు నిలిచాయి.