Home   »  జాతీయంవార్తలు   »   యమునా నది ఉద్రిక్తత పెరుగుతుంది…. ఢిల్లీ సీఎం అత్యవసర సమావేశం….

యమునా నది ఉద్రిక్తత పెరుగుతుంది…. ఢిల్లీ సీఎం అత్యవసర సమావేశం….

schedule sirisha

న్యూఢిల్లీ: యమునా నది అత్యధికంగా 207.55 మీటర్లకు చేరుకోవడంతో నగరంలో వరద ముప్పు పొంచి ఉన్నందున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఢిల్లీ సెక్రటేరియట్‌లో ఈ సమావేశం జరుగుతుందని, ఇందులో సంబంధిత అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 1978లో నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది. మల్లి ఇప్పుడు కూడా అదే పరిస్థితి.

ఉత్తర ఢిల్లీలోని చండీగఢ్ సమీపంలోని రింగ్‌రోడ్‌పైకి వరద నీరు వచ్చేలా ఉందని అధికారులు ఇసుక బస్తాలను వినియోగిస్తున్నారు. ఉదయం 11 గంటలకు నీటి మట్టం 207.48 మీటర్లకు చేరుకోగా, ఆ తర్వాత వేగంగా 207.55 మీటర్లకు పెరిగింది. కాశ్మీర్ గేట్ సమీపంలోని ఓ గోశాల పూర్తిగా నీట మునిగింది.

మరోవైపు ఢిల్లీ పోలీసు అధికారులు కూడా సహాయక చర్యల్లో సహకరిస్తున్నారు. యమునా నది వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవల్లో వెళ్లి కాపాడారని అని అధికారులు తెలిపారు.