Home   »  వార్తలు   »   ZP Chairman| దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

ZP Chairman| దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

schedule mounika

ఆదిలాబాద్: అంబేద్కర్ విగ్రహం దాతగా జడ్పీ చైర్మన్(ZP Chairman) జనార్దన్ రాథోడ్ దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఉట్నూరు మండలం లోని గంగాపూర్ గ్రామంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్(ZP Chairman) జనార్దన్ రాథోడ్ కి ఆత్మీయ సన్మానం జరిగిన అనంతరం ఆయన మాట్లాడారు.

ముందుగా గంగాపూర్ గ్రామస్తులు, మహిళలు హారతులు పట్టుకొని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ కి ఘన స్వాగతం పలికారు. ఆత్మీయంగా సాలువతో సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మీయ సన్మానం చేయడం నాకు ఆనందంగా ఉందని,మీకు రుణపడి ఉంటానని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. దళితులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కావున వచ్చే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని అన్నారు.

గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని ,ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానిక సర్పంచ్ దుర్వా రేణుకా బాయి, మాజీ వైస్ ఎంపీపీ సలీముద్దీన్, అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రజ్ఞా శిల్, మాజీ MPTC సిద్ధం రాజేశ్వర్, ధర్మ సర్పంచ్ స్వామి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.