Home   »  రాజకీయం   »   BRS లో చేరిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన 200 మంది కార్యకర్తలు..

BRS లో చేరిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన 200 మంది కార్యకర్తలు..

schedule mounika

ఆదిలాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు అసౌకర్యం కలిగించాయని, అయితే (KCR)ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వినూత్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని బీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్న అన్నారు.

సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి ఆకర్షితులు అవుతూ ఎమ్మెల్యే జోగు రామన్న నాయకత్వాన్ని బలపరుస్తూ బిఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరందుకుంటున్నాయి. అందులో భాగంగానే బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో చేరికలు ముమ్మరంగా కొనసాగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్, బిజెపిలో కీలకంగా రాణించినటువంటి పలువురు నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సూరం అనిల్. విశ్వాంబార్, అలిం సమక్షంలో మరో 200 మంది యువకులు మహిళలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

BRS(KCR) మేనిఫెస్టోలో వివిధ వర్గాల కోసం పథకాలు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ..BRS ప్రకటించిన మేనిఫెస్టోలో సమాజంలోని వివిధ వర్గాల కోసం వినూత్న పథకాలు ఉన్నాయి. మహిళలు రూ.400లకే ఎల్పీజీ సిలిండర్ పొందవచ్చని, మహిళలకు నెలకు రూ.3వేలు గౌరవ వేతనం అందజేస్తామని తెలిపారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు మొత్తాన్ని ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామని తెలిపారు. బిఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇజ్జగిరి నారాయణ, బిసి సెల్ నాయకుడు దాసరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.