Home   »  రాజకీయం   »   లోక్‌సభ నుండి మరో 34మంది ఎంపీల సస్పెండ్… !

లోక్‌సభ నుండి మరో 34మంది ఎంపీల సస్పెండ్… !

schedule mahesh

పార్లమెంట్: లోక్‌సభ నుండి మరో 34 మంది విపక్ష ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ (MPs suspended) చేయడం జరిగింది. సభలో ఆందోళన చేస్తున్నందుకు కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తో సహా 34 మంది విపక్ష సభ్యులను లోక్ సభ నుండి స్పీకర్ సస్పెండ్‌ చేశారు.

MPs suspended

లోక్‌సభ నుండి మరో 34మంది MPs suspended

M.Pల సస్పెన్షన్ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు కొనసాగుతుంది. సస్పెండ్ అయిన ఎంపీల్లో అధిర్ రంజన్ చౌదరి, టీఆర్ బాలు, దయానిధి మారన్, మాణిక్కం ఠాగూర్, కనిమొళి, P.R నటరాజన్,V.K శ్రీకందన్, బెన్నీ బహనన్, K.సుబ్రమణ్యం, S. వెంకటేశన్, మహ్మద్ జావేద్లు వున్నారు.

శీతాకాల సమావేశాలు ముగిసే వరకు కొనసాగనున్న సస్పెన్షన్

శీతాకాల సమావేశాల వరకు 30 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా, ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో నలుగురిని సస్పెండ్ చేశారు. వీరందరు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడం జరిగింది. ఎంపీల సస్పెన్షన్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో ప్రతిపాదించారు.

లోక్‌సభ లో నిరసనకు దిగిన విపక్షాలు

ఇటీవల ఇద్దరు యువకులు లోక్ సభలోకి చొరబడి రంగు పొగలు విడుదల చేసిన సంగతి తెలిసిన విషయమే. ఈ విషయంలో ప్రధాని లేదా కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం కూడా సభలో విపక్షాలు నిరసన తెలిపాయి. భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టు బట్టడం జరిగింది.

విపక్షాల ఆందోళనతో పలు మార్లు వాయిదా పడిన లోక్‌సభ, రాజ్యసభ

లోక్‌సభతో పాటు రాజ్యసభ కూడా పలుమార్లు వాయిదా పడింది. భద్రతా వైఫల్యాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. వెల్ లోకి వచ్చి నినదించడం సభా మర్యాదలకు విరుద్ధమని బిర్లా పేర్కొన్నారు. ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల సహకారం అవసరమని ఓం బిర్లా తెలిపారు.

Also Read: శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ… కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ