Home   »  రాజకీయం   »   Amit Shah |అమిత్ షా టూర్ అసంతృప్తి..

Amit Shah |అమిత్ షా టూర్ అసంతృప్తి..

schedule mounika

కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ టూర్(TOUR) తో టీబీజేపీలో అసంతృప్తులను నిద్రలేపినట్టైంది.

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్రం అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇందుకోసం హైదరాబాద్ కు అమిత్ షా శనివారం రాత్రి వచ్చారు. ఈ క్రమంలో అమిత్ షాతో జరిగిన భేటీలో టీబీజేపీ కీలక నేతలు లేకపోవడం చర్చ కు దారితీసింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ ముగ్గురితోనే షా చర్చలు జరపడం వెనుక కొంత అసంతృప్తి(unsatisfied) కి లోనయైనట్లు తెలుస్తోంది.

ఎన్నికల వేళ టీ బీజేపీ లీడర్ల రహస్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా తనను కలిసేందుకు రాష్ట్ర నేతలు కొంత మందికే అవకాశం ఇవ్వడం. కిషన్ రెడ్డి, బండి, ఈటలతో భేటీకి అమిత్ షా తమను పిలవకపోవడంపై వీరు అసంతృప్తి కి లోనయైనట్లు కనపడుతోంది.


అమిత్ షా(Amit Shah)తెలంగాణ టూర్ తో టీబీజేపీలో అసంతృప్తి…

అమిత్ షా హైదరాబాద్ టూర్(TOUR) సందర్భంగా జరిగిన భేటీలో తెలంగాణ బీజేపీలో నేతలు లేకపోవడంపై చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో టీబీజేపీ నేతలు అలకబూనినట్లు అందుకు సోమవారం హైదరాబాద్ లో సీక్రెట్ గా మీట్ అయినట్టు సమాచారం.

షా భేటీలో పాల్గొనని తెలంగాణ బీజేపీ నేతలు నిన్నరహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో బీజేపీ కీలక నేతలు వివేక్, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. ప్రధానంగా ఈటల రాజేందర్ వ్యవహారశైలిపై వీరు డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై వీళ్లంతా చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ తర్వాత ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలవాలని నిర్ణయించినట్లు సమాచారం.