Home   »  రాజకీయం   »   నిర్మల్‌ పట్టణంలో బంద్‌… విజయవంతగా మూడో రోజు.!

నిర్మల్‌ పట్టణంలో బంద్‌… విజయవంతగా మూడో రోజు.!

schedule raju

తెలంగాణ: నిర్మల్‌ పట్టణంలో బంద్‌ కొనసాగుతోంది. మున్సిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా బిజేపీ బంద్‌కు పిలుపునివ్వగా… వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూతబడ్డాయి. వ్యాపారులు స్వచ్చందంగా దుకాణాలను మూసివేశారు. మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయాలని బిజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే బీజేపీ శ్రేణులు బంద్ సందర్భంగా నిర్మల్‌ పట్టణంలో తెరుచున్న దుకాణాలను బీజేపీ కార్యకర్తలు మూయిస్తున్నారు.

 మహేశ్వర్‌రెడ్డి దీక్షకు బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి పేరిట సీఎం కేసీఆర్ అన్ని రకాల దోపిడీలకు తెరలేపారన్నారు. నిరుపేద భూములను లాక్కోవడానికే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని మండిపడ్డారు.