Home   »  రాజకీయం   »   నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ..బీఆర్ఎస్‌ ఎల్పీ నేత ఆయనే?

నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ..బీఆర్ఎస్‌ ఎల్పీ నేత ఆయనే?

schedule mounika

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi)ఇక నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు.

Bharat Rashtra Samithi

ఉదయం 11 గంటలకు అసెంబ్లీ తొలి సమావేశానికి హాజరు..

తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. సభలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా..ప్రతిపక్ష హోదాలో బీఆర్‌ఎస్‌(Bharat Rashtra Samithi )అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం..

తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించనున్న KTR

కాగా, KTR అసెంబ్లీ సమావేశానికి ముందు ఉన్న గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి, నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.

శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక..

ఈ సమావేశానికి 38 మంది బీఆర్ఎస్ (Bharat Rashtra Samith)iఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వీరిలో ఒకర్ని బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. అయితే అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొని పార్టీ తరఫున శాసన సభాపక్ష నేతగా ఎవరుంటారన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. బీఆర్‌ఎస్‌ (Bharat Rashtra Samithi) చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌నే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.. 

ఇవాళ్టి శాసనసభాపక్ష భేటీలో కేసీఆర్‌ పేరునే ప్రతిపాదించి.. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అనంతరం ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ఉదయం 11.00 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ తొలి సమావేశానికి KTR హాజరవుతారు.

Bharat Rashtra Samithi|ప్రొటెం స్పీకర్‌గా అక్బర్..

కాగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకరం చేయించనున్నారు. ఈ ప్రొటెం స్పీకర్‌గా AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించనున్నారు. అందులో భాగంగా ప్రొటెం స్పీకర్ చేత రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ముందుగా ప్రమాణం చేయించనున్నారు. ఇవాళ ఉదయం  8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీతో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు.

6 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన అక్బర్

ఆ తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ హోదాలో అక్బరుద్దీన్ ఓవైసీ.. ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.AIMIM తరఫున అక్బర్ ఇప్పటివరకు 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలను ఆయన నిర్వహించాల్సి ఉంటుంది.

కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం..

కాగా, యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన కేసీఆర్ గారి తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స.. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు.. కేసీఆర్ గారికి నిర్వహించిన సర్జరీ విజయవంతం అయినట్లు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సకు ఆయన శరీరం బాగానే సహకరించిందని వారు తెలిపారు. సర్జరీ విజయవంతం కావడంతో కేసీఆర్ గారిని ఆపరేషన్ థియేటర్ నుంచి సాధారణ రూమ్ కు మార్చారు. కేసీఆర్ గారు పూర్తిగా కోలుకోవడానికి మరో 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు.

ALSO READ: కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ..