Home   »  రాజకీయం   »   సంప్రదాయాన్ని కాలరాసిన కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: కిషన్‌రెడ్డి

సంప్రదాయాన్ని కాలరాసిన కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: కిషన్‌రెడ్డి

schedule mounika

తెలంగాణ బీజేపీ(Bharatiya Janata Party)ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో జరిగిన కీలక భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ నియామకంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

తెలంగాణ తొలి శాసనసభ సమావేశాలు, ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. అందుకే అసెంబ్లీలో సీనియర్లను కాదని మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకునేందుకు అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రొటెం స్పీకర్ పదవి కట్టబెట్టి శాసన సభ సంప్రదాయాన్ని కాలరాసిన కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు (Bharatiya Janata Party) BJP కిషన్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ని నియమించడాన్ని BJP పార్టీ వ్యతిరేకత..

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని BJP పార్టీ వ్యతిరేకిస్తోందని, ఇది సీనియర్ ఎమ్మెల్యేలను నియమించే సంప్రదాయానికి విరుద్ధమని తెలంగాణ బిజెపి చీఫ్ జి కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు.

AIMIM తో కాంగ్రెస్‌కు అవగాహన ఉందని ఆరోపిస్తూ.. రాష్ట్రంలో 8 సీట్లు గెలిచి 14% ఓట్లకు చేరుకున్నామని అన్నారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్‌ నేతను నియమించే ఆచారం ఉంది.

స్పీకర్‌ను నియమించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తాం:కిషన్ రెడ్డి

ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయడాన్ని బహిష్కరించిన కిషన్‌రెడ్డి, స్పీకర్‌ను నియమించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు.

AIMIM తో మేం ఎప్పటికీ పొత్తు పెట్టుకోము. దీనిపై గవర్నర్ వద్దకు వెళ్తాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీతో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగకూడదని డిమాండ్ చేస్తూ గవర్నర్‌ను ఆశ్రయించాలని బీజేపీ నిర్ణయించింది.

భాగ్యలక్ష్మి మాత సాక్షిగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయం:Bharatiya Janata Party

కాగా, శనివారం ఉదయం కిషన్ రెడ్డితో ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మన సంస్కృతి – సాంప్రదాయాలను గౌరవిస్తూ చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. “భాగ్యలక్ష్మి మాత సాక్షిగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయం” అని బీజేపీ కిషన్ రెడ్డి అన్నారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, ప్రమాణ స్వీకారోత్సవం, ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ఎంపిక అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవడంపై కూడా చర్చించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ స్థానానికి రాజా సింగ్, ఈటల, మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి పేర్లను పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నాయి.

ALSO READ: తెలంగాణ కొత్త కేబినెట్ మంత్రులు వీరే..!