Home   »  రాజకీయం   »   కృష్ణాష్టమి, రక్షాబంధన్, గురునానక్ జయంతికి సెలవులు రద్దు చేసిన బీహార్ ప్రభుత్వం

కృష్ణాష్టమి, రక్షాబంధన్, గురునానక్ జయంతికి సెలవులు రద్దు చేసిన బీహార్ ప్రభుత్వం

schedule mahesh

బీహార్‌: తాజాగా బీహార్ ప్రభుత్వం (Bihar government) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బీహార్ విద్యా శాఖ సోమవారం రోజున 2024 సెలవుల జాబితాని ప్రకటించింది. ఈ సెలవులలో దేశ మొత్తం జరుపుకునే ప్రధాన హిందూ పండుగలకు బీహార్ ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. అంతేకాకుండా అనేక పండుగలకు సెలవుల సంఖ్యను తగ్గించేసింది.

Bihar government

ప్రధాన పండుగలకు సెలవులు రద్దు చేసిన బీహార్ ప్రభుత్వం

హిందూ మత ప్రధాన పండుగలైన మహా శివరాత్రి, శ్రీరామ నవమి, శ్రావణ చివరి సోమవారం, తీజ్, కృష్ణాష్టమి , అనంత్ చతుర్దశి, భాయ్ దూజ్, గోవర్ధన్ పూజ, గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిలకు సెలవులు రద్దు చేయబడ్డాయి. అలాగే, హోలీ , దుర్గాపూజ , దీపావళి మరియు ఛత్ (Bihar government) పండుగకు సెలవులు తగ్గించారు.

మొహర్రం,బక్రీద్,ఈద్ సెలవులను పెంచిన Bihar government

మొహర్రం, బక్రీద్, ఈద్ సెలవులను పెంచిన ప్రభుత్వం, అదే సమయంలో, గురుగోవింద్ సింగ్ జయంతి, రవిదాస్ జయంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. హోలీ సెలవులను మూడు రోజుల నుండి రెండు రోజులకు, దుర్గాపూజ సెలవులను ఆరు నుండి మూడు రోజులకు, దీపావళి, ఛత్ సెలవులను ఎనిమిది నుండి నాలుగు రోజులకు కుదించారు. అదే సమయంలో, ఈద్ సెలవులను రెండు నుండి మూడు రోజులకు, బక్రీద్‌ను రెండు నుండి మూడు రోజులకు, మొహర్రం సెలవులను ఒక రోజు నుంచి రెండు రోజులకు పొడిగించారు.

బీహార్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ బీజేపీ

అయితే బీహార్ ప్రభుత్వ నిర్ణయంపై (Bihar government) బీజేపీ తీవ్రంగా మండి పడింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. హిందువులు తమ మతపరమైన పండుగలను బీహార్‌లో జరుపుకోకూడదని బీజేపీ నేతలు మండిపడ్డారు.

హిందువులను అణిచివేసేందుకు బీహార్ ప్రభుత్వం పన్నిన కుట్ర: BJP

అంతేకాకుండా శివరాత్రి, రామ నవమి, శ్రావణ చివరి సోమవారం, తీజ్, కృష్ణాష్టమి , అనంత్ చతుర్దశి, భాయ్ దూజ్, గోవర్ధన్ పూజ, గురునానక్ జయంతి మరియు కార్తీక పూర్ణిమ సెలవులను రద్దు చేయడం అనేది హిందువులను అణిచివేసేందుకు జరుగుతున్న కుట్రలని మండిపడ్డారు. అంతే కాకుండా అతి పెద్ద పండుగ అయిన దీపావళి, దుర్గాపూజ, ఛత్ కు సెలవులు తగ్గించడం బాధాకరమన్నారు. ఈ Bihar government నాయకులకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు.

2023-2024లో మొత్తం సెలవుల సంఖ్య 60 రోజులుగా ప్రకటించిన విద్యాశాఖ

2023-2024లో మొత్తం సెలవుల సంఖ్య 60 రోజులుగా ప్రకటించారు. అదే సమయంలో వేసవి సెలవులను 20 నుండి 30 రోజులకు పొడగించారు. వేసవి సెలవులు ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు వుండనున్నాయి. 2023లో వేసవి సెలవులు జూన్ 5 నుంచి 27 వరకు ఇవ్వడం జరిగింది. లోక్‌సభ ఎన్నికల కారణంగా వేసవి సెలవుల్లో మార్పులు చేసినట్టు తేలుస్తుంది.

Also Read: కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసిన సీఎం…ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం..!