Home   »  రాజకీయం   »   17 లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సాధించడమే BJP లక్ష్యమన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

17 లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సాధించడమే BJP లక్ష్యమన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

schedule mahesh

Lok Sabha seats | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో (Lok Sabha seats) మెజారిటీని కైవసం చేసుకునేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి G.కిషన్‌రెడ్డి తెలిపారు.

bjp-aims-to-win-majority-in-17-lok-sabha-seats

Lok Sabha seats | భాజపా చేపట్టిన ‘గావ్‌ చలో’ కార్యక్రమం ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా అమీర్‌పేట గ్రామంలో పర్యటించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు 12 వేల గ్రామాల్లో పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వానికి మద్దతుగా తెలంగాణలో BJPకి మంచి స్పందన లభిస్తోందని వ్యాఖ్యానించారు.

17 లోక్‌సభ స్థానాల్లో BJP గట్టి పోటీ ఇస్తుందన్న కిషన్ రెడ్డి

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో BJP గట్టి పోటీ ఇస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో AIMIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తన్నామన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో BJP ఓటింగ్‌ శాతం బాగా పెరిగిందని, మజ్లిస్‌ (AIMIM) ఓట్ల శాతం తగ్గిందని ఆయన విలేకరులతో అన్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు గాను బీజేపీ నాలుగు స్థానాలను గెలుచుకుంది. ‘గావ్ చలో’ ప్రచారం గురించి వివరిస్తూ, బిజెపి కార్యకర్తలు దాదాపు 12,000 గ్రామాల్లో 24 గంటల పాటు ఉండి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని, వారికి పార్టీ కార్యకలాపాలను వివరించడం ద్వారా వారి మద్దతును పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Also Read | దేశ భవిష్యత్తు బాగుండాలంటే BJPలో చేరాలన్న బండి సంజయ్‌