Home   »  రాజకీయం   »   BRS హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం..

BRS హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం..

schedule mounika

గజ్వేల్‌ :తెలంగాణ రాష్ట్రం లో BRS హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని KCR అన్నారు. గ‌జ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం లో KCR మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్ మళ్లీ ఎన్నికల్లో గెలుపొందాలని, అందుకోసం రానున్న 40 రోజుల్లో పార్టీ కార్యకర్తలు అన్ని విబేధాలు పక్కనపెట్టి కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి KCR సూచించారు.

BRS ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపును ఇచ్చిన KCR..

మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతుల బాధ తనకు అర్థమవుతోందన్నారు. తమ గ్రామంలో రైతులే కాదు, తాను, తన కుటుంబం కూడా భూమిని కోల్పోయిందని అన్నారు. అయితే అదంతా గొప్ప కార్యం కోసమేనని, రైతులు చేసిన ఈ మహత్తర కార్యానికి ప్రజలు రుణపడి ఉంటారని, గజ్వేల్‌లోనే కాకుండా సమీపంలోని మూడు నియోజకవర్గాల్లో కూడా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గులాబీ పార్టీ 90-105 సీట్లు గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.

గజ్వేల్‌ను వదిలిపెట్టేది లేదు : KCR

కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నప్పటికీ గజ్వేల్‌ను వదిలిపెట్టేది లేదని బీఆర్‌ఎస్‌ అధినేత తెలిపారు. వారి అవసరాలు తీరుస్తానని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గజ్వేల్‌కు వస్తానని చెప్పారు. కాళేశ్వరం, కొండ పోచమ్మ, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టులను కాంగ్రెస్‌ నేతలు, కోదండరామ్‌ లాంటి వ్యక్తులు ఈ ప్రాజెక్టులను అడ్డుకున్నారని కేసీఆర్‌ అన్నారు. రెండో దశలో గజ్వేల్‌లోని ప్రతి గ్రామానికి నీరు ఇస్తామని చెప్పారు.