Home   »  రాజకీయం   »   BRS పార్టీకి మరో షాక్… కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి MP

BRS పార్టీకి మరో షాక్… కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి MP

schedule mahesh

Venkatesh Netha | భారత రాష్ట్ర సమితి (BRS)కి పార్టీ సీనియర్ నేత, పెద్దపల్లి MP వెంకటేష్ నేత షాక్ ఇచ్చారు. మంగళవారం రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

pedpadallibrs-mp-venkatesh-netha-joined-congress

Venkatesh Netha | భారత రాష్ట్ర సమితి (BRS)కి పార్టీ సీనియర్ నేత, పెద్దపల్లి MP వెంకటేష్ నేత, మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఇంటికి చేరుకొన్నారు. KC వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ కావడం జరిగింది. దీంతో లోక్ సభ ఎన్నికల ముందు BRS పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

CM రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన Venkatesh Netha

BRS పార్టీలో ఈసారి సిట్టింగ్ లకు టికెట్ దక్కటం కష్టమేనని ప్రచారం జరుగుతుండటంతో పాటు పార్టీ అధిష్ఠానం కొన్నిరోజులుగా పెద్దపల్లి MP వెంకటేశ్ నేతను దూరం పెట్టడంతో అయన పార్టీ మారినట్లు తెలుస్తుంది. జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత గతంలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేయడం జరిగింది.

ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంకటేశ్ మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరవాత ఏడాది అనూహ్యంగా BRSలో చేరి పెద్దపల్లి MP టికెట్ దక్కించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read | హైదరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లో 17 మంది CIల బదిలీ..!