Home   »  రాజకీయం   »   సీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు..

సీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు..

schedule mounika

కడప జిల్లా: ‘ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రాగానే రాయలసీమ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రజలకు హామీ ఇచ్చారు.

Nara Chandrababu

కడప జిల్లా: కడప జిల్లాలోని కమలాపురంలో శుక్రవారం జరిగిన రా-కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. YSRCP ప్రభుత్వం అనేకసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని, టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమన్నారు.

“టీడీపీకి ఎలా పరిపాలించాలో, సంపదను ఎలా సృష్టించాలో, పేదలకు ఎలా న్యాయం చేయాలో తెలుసు” అని చంద్రబాబు అన్నారు. YSRCP ప్రభుత్వం రిబ్బన్లు కత్తిరించడం, ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు పూయడం, పథకాలకు పేర్లు పెట్టడం వంటి వాటికే ఎక్కువ శ్రద్ధ చూపుతోంది తప్ప అసలు పని గురించి కాదన్నారు.

“రాయలసీమను మళ్లీ ‘రతనాల సీమ’గా తీర్చిదిద్దే బాధ్యత నాది”: Chandrababu..

రాయలసీమను మళ్లీ ‘రతనాల సీమ’గా తీర్చిదిద్దే బాధ్యత నాది. కాల్వల్లో నీళ్లు లేకపోవడం వల్ల రైతుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. “బానకచర్లకు గోదావరి నీటిని తీసుకురావడమే నా లక్ష్యం” అని చంద్రబాబు అన్నారు. రాయలసీమకు నీరు తప్ప అన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఉపాధి కోసం ప్రజలు ఎక్కడికీ వలస వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఈ బహిరంగ సభకు TDP సీనియర్ నాయకులు పుత్తా నరసింహారెడ్డి, R. శ్రీనివాసులురెడ్డి, జిల్లా జనసేన అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

ALSO READ: ఈనెల 21న AP కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల..