Home   »  రాజకీయం   »   హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్‌..

హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్‌..

schedule mounika

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Chandrashekar Rao)కు తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే.ఆయన ఫామ్ హౌస్ లోని తన బాత్రూమ్ లో పట్టుతప్పి కాలుజారి పడ్డారు. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Chandrashekar Rao

ఫామ్ హౌస్ లోని తన బాత్రూమ్ లో KCR పట్టు తప్పి కాలుజారి పడ్డారు. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు వైద్యులు గుర్తించారు.

ఈ ఉదయం 11 గంటలకు ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

కేటీఆర్, హరీశ్ రావు, కవిత మరియు KCR కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారు. వైద్యులతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడారు. కేసీఆర్ కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని చెపుతున్నారు.

ఆయన్ను కొద్ది రోజులుగా పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి కలుస్తున్నారు.కాగా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి పై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.  

ప్రజాసేవే ముఖ్యం:Chandrashekar Rao

కాగా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆటుపోట్లు సహజమని, ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన ప్రజలకు దూరంగా ఉండటం నాయకుల లక్షణం కాదని KCR పేర్కొన్నారు.

అంతకుముందు గురువారం ఎర్రవల్లిలోని తన నివాసానికి వరుసగా నాలుగో రోజు కూడా పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివచ్చారు. కేసీఆర్‌తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కేసీఆర్‌ను కలిసినవారిలో ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, గంగాధరగౌడ్‌, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, D.S రెడ్యానాయక్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు,V. ప్రకాశ్‌ తదితరులు ఉన్నారు.

అధైర్యపడొద్దు, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిసారించి నిత్యం ప్రజల్లో ఉండాలి:Chandrashekar Rao

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. అధైర్యపడొద్దని, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిసారించి నిత్యం ప్రజల్లో ఉండాలని ఉద్బోధించారు. దేశంలో మరే రాజకీయ పార్టీకి లేని పార్టీ బలం బీఆర్‌ఎస్‌కు ఉన్నదని, 60 లక్షల మంది పార్టీ శ్రేణులు అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ప్రజాసేవలో మమేకం అయ్యామో అదే స్థాయిలో ఇప్పుడూ ఉండాలని దిశానిర్దేశం చేశారు.

త్వరలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఎన్నిక, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో త్వరలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుందామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలతో చెప్పారు.

కాగా, ఈ సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవటంతో పాటు పార్టీ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.ఇంతలోనే K.C.R గారికి ఈ అనుకోని ప్రమాదం జరిగింది

ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా గద్దె దించడంతో, రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (BRS) హ్యాట్రిక్ సాధించడంలో విఫలమైంది. బీఆర్‌ఎస్‌కు 39, కాంగ్రెస్‌కు 64 సీట్లు వచ్చాయి.

ALSO READ: ఈ ఓటమి తాత్కాలిక బ్రేక్ మాత్రమే.. ఫలితాల పట్ల నిరాశవద్దు: కేటీఆర్