Home   »  రాజకీయం   »   దివ్యాంగులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ :ఎమ్మెల్యే చల్లా

దివ్యాంగులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ :ఎమ్మెల్యే చల్లా

schedule mounika

దివ్యాంగులకు అండగా బి.ఆర్.ఎస్.ప్రభుత్వం నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మంగళవారం గీసుగొండ మండలంలోని ఎస్.ఎస్.గార్డెన్స్ లో గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన దివ్యాoగులతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం దివ్యాంగులకు పెంచన్ రూ.4016/- చేస్తు ఇచ్చిన మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని అన్నారు. వైకల్యం అనేది శరీరానికే గానీ లక్ష్యానికి, మనసుకు కాదని అన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. తెలంగాణ ఎక్కడ ఉన్నది అనే స్థితి నుంచి ప్రపంచమంతా తెలంగాణ వైపే చూసే స్థితికి చేరిందన్నారు. తిండిలేక ఇబ్బంది‌పడ్డ తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరింది. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో ఉన్న బిజెపి అడ్డుకుంటుందన్నారు.

బిజెపి నాయకులు గ్రామాలలో కనిపిస్తే తెలంగాణకు ఏమి చేసారో చెప్పాలని నిలదీయాలని ప్రజలకు సూచించారు. దశాబ్దాలకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు సోయితప్పిన మాటలు మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు అవుతున్న కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో దివ్యాంగులకి కూడా ఉద్యగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి. ఓ ,ఏంపిపిలు,జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపిటిసిలు,సొసైటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు,ఎంపీడీఓ లు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.