Home   »  రాజకీయం   »   ముఖ్యమంత్రి KCR తెలంగాణకు వెన్నుపోటు..!

ముఖ్యమంత్రి KCR తెలంగాణకు వెన్నుపోటు..!

schedule sirisha

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జావడేకర్ సమావేశంలో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో ఏర్పడిన తెలంగాణ ప్రజలను BRS అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వెన్నుపోటు పొడిచారని అన్నారు. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు (KLIP)లో అవినీతిపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు.

“కేసీఆర్ ప్రభుత్వం వల్ల ప్రజలకు జరిగిన నష్టానికి అన్ని విధాలా న్యాయం చేస్తాం’’ అని జావడేకర్ అన్నారు. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది. నిధుల విషయంలో రాష్ట్రం రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. “ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఏం చేయాలో చూపిస్తాం’’ అని అన్నారు. ఇతర పార్టీల నుండి పలువురు నాయకులు కాషాయ పార్టీలో చేరబోతున్నారని జావడేకర్ చెప్పారు.