Home   »  రాజకీయం   »   నేడే రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపిక..!

నేడే రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపిక..!

schedule mahesh

జైపూర్: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన భారతీయ జనతా పార్టీ ఆ రెండు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కొత్త వారిని ముఖ్యమంత్రులుగా నియమించింది.

Chief Minister of Rajasthan

నేడే Chief Minister of Rajasthan ఎంపిక ప్రక్రియ

అయితే ఇప్పుడు అందరి దృష్టి రాజస్థాన్ సీఎం (Chief Minister of Rajasthan) సీటుపైనే వుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యి వారం రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ ఉత్కంఠకు నేటితో తెరపడే అవకాశం కనిపిస్తుంది.

ఈ రోజు సమావేశంలో శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్న BJP

రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇద్దరు సహచరులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ ఉపాధ్యక్షురాలు సరోజ్ పాండే సమక్షంలో ఈ సమావేశం జరగబోతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైయ్యే ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పాల్గొని శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు.

అందరి దృష్టి రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే పైనే

ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్ లో బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత బాబా బాలక్ నాథ్ పేరు ప్రచారంలోకి రావడం జరిగింది. M.P పదవికి రాజీనామా చేసిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియా కుమారి కూడా సీఎం (Chief Minister of Rajasthan) రేసులో పోటీ పడుతున్నారు. అయితే అందరి దృష్టి రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే పైనే వుంది.

కొత్తవారిని సీఎం చేయాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం

వసుంధర రాజే కూడా సీఎం పగ్గాలు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా వసుంధర రాజే గత వారం ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చలు నిర్వహించారు. అయితే కొత్తవారిని సీఎం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది.