Home   »  రాజకీయం   »   Chikoti Praveen |ప్రవీణ్‌ బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు..

Chikoti Praveen |ప్రవీణ్‌ బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు..

schedule mounika

చీకోటి ప్రవీణ్‌(Chikoti Praveen)బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం పార్టీలో చేరేందుకు చీకోటి ప్రవీణ్ భారీ ర్యాలీగా నాంపల్లి బీజేపీ కార్యాలయనికి వెళ్లారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోవాల్సింది.

ఇంతలో సడెన్ గా చీకోటి ప్రవీణ్ చేరిక ఆగిపోయింది. పార్టీలో చేరేందుకు బీజేపీ కార్యాలయానికి చీకోటి ప్రవీణ్ వెళితే ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు.

బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్..చీకోటి ప్రవీణ్(Chikoti Praveen) చేరిక అంశం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

చీకోటి చేరికను వెంటనే ఆపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో చీకోటి ప్రవీణ్ పార్టీలో చేరాల్సి ఉంటే.. కొన్ని అనివార్య కారణాల వలన కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయానికి రాకపోగా, అప్పటి వరకూ పార్టీ ఆఫీస్ లో ఉన్న ఈటల కూడా బయటకు వెళ్లిపోయారు. దీంతో చీకోటి చేరిక వాయిదా పడింది.

బీజేపీలో తన చేరిక ఆగిపోవడంపై చీకోటి ప్రవీణ్ స్పందించారు. తన చేరిక విషయంలో ఇంకా ఎవరి నుంచో క్లారిటీ రావాల్సింది ఉందన్నారాయన.

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయం ఇచ్చారు చీకోటి ప్రవీణ్. ఎన్నో ఆటుపోట్లను చూశాను, ఇంతకంటే పెద్ద సవాళ్లు ఎదుర్కొన్నా అని వ్యాఖ్యానించారు.

ప్రాంతాలతో సంబంధం లేకుండా విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారని అన్నారు.

బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరన్న చీకోటి ప్రవీణ్..పార్టీ పెద్దలతో భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. మీ అందరి బలం, ఆశీర్వాదం, అభిమానం నాకుందంటూ ఫ్యాన్స్ తో అన్నారు. రాజకీయాల్లో ఆవేశం పనికి రాదని ఓపికతో ఉండాలన్నారు. రేపు దీక్ష కారణంగా సీనియర్లు అందుబాటులో లేరని బీజేపీ కార్యాలయం సిబ్బంది చెప్పడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు.

ప్రవీణ్ ఇటీవల దిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. తెలంగాణకు చెందిన బండి సంజయ్, డీకే అరుణ, రాంచందర్ రావును కలిశారు.

ప్రధాని మోదీ స్ఫూర్తితో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డిలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని చీకోటి అన్నారు.