Home   »  రాజకీయం   »   Cleft | ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినా తమకేం సంబంధం లేదు..

Cleft | ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినా తమకేం సంబంధం లేదు..

schedule mounika

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినా(Cleft) తమకేం సంబంధం లేదని తీన్మార్ మల్లన్న అన్నారు. తాము కేసీఆర్‌కు వ్యతిరేకమని.. ప్రతిపక్ష పార్టీలకు కాదన్నారు. తమతో కలిసి పని చేసేందుకు ఏ ప్రతిపక్ష పార్టీ ముందుకు వచ్చినా స్వాగతిస్తామన్నారు మల్లన్న.

వీలైనంత త్వరగా ఎలక్షన్ కమిషన్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లన్న. తెలంగాణలో వైద్యం, విద్య మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పారు.

సత్వర న్యాయం, ప్రజాప్రతినిధుల రీకాలింగ్‌కు తమ పార్టీ మద్దతిస్తుందన్నారు. మేడ్చల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు మల్లన్న.

తెలంగాణలోని అన్ని స్థానాల్లో తెలంగాణ నిర్మాణ పార్టీ బరిలో ఉంటుందన్నారు.

వ్యతిరేక ఓటు చీలినా(Cleft )అది తమ బాధ్యత కాదని.. ప్రతిపక్షాలను గెలిపించేందుకు తాము ఇక్కడ లేమన్నారు మల్లన్న. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు.

తీన్మార్ మల్లన్న 2015లో నల్గొండ -ఖమ్మం –వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.

2021 మార్చిలో నల్గొండ –ఖమ్మం–వరంగల్‌ ‌ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.

ఆయన ప్రస్తుతం క్యూ గ్రూప్ మీడియాను నిర్వహిస్తున్నారు.. ఆయన బీజేపీలో కూడా కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు సొంతంగా పార్టీని ప్రారంభించారు.

మల్లన్న ఇప్పటికే ఆయన అన్ని జిల్లాల్లో పర్యటించారు.. పార్టీ ఆవిర్భావంతో రాబోయే రోజుల్లో మరింతగా జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.

ఎన్నికల సంఘం దగ్గర ప్రక్రియ మొత్తం పూర్తయితే తెలంగాణ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం సొంత గ్రామం. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. హైదరాబాద్ జెఎన్టీయూ నుంచి 2009లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత పలు న్యూస్ ఛానెల్స్‌లలో పని చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తీన్మార్ వార్తలు ద్వారా నవీన్ తీన్మార్ మల్లన్నగా ఫేమస్ అయ్యారు.