Home   »  రాజకీయం   »   “రాబోయేది ప్రజా ప్రభుత్వం”: నారా లోకేష్

“రాబోయేది ప్రజా ప్రభుత్వం”: నారా లోకేష్

schedule mounika

లోకేష్ పాదయాత్ర ఆదివారంతో 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ”రాబోయేది ప్రజా ప్రభుత్వం” అని(Nara Lokesh) అన్నారు. కాగా, ఆదివారం లోకేష్ పాదయాత్ర 218వ రోజు తుని నియోజకవర్గం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా.. ఒంటిమామిడి తొండంగి, శృంగవృక్షం, వలసపాకల, టి.తిమ్మాపురం మీదుగా తేటగుండ విడిది కేంద్రానికి చేరుకుంది.

Nara Lokesh

నేడు 219 వ రోజు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం..

యువగళం పాదయాత్రలో 219 వ రోజు (సోమవారం) చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సందర్భంగా తేటగుంట యనమల అతిథిగృహం వద్ద లోకేష్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ హాజరు కానున్నారు. 

కాగా, యువగళం పాదయాత్ర 3 వేల కి.మీ చేరుకున్న సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 3 వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

లోకేష్ పాదయాత్ర ఈ రోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రవేశించనుంది. కావున యువనేతకు భారీ స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు.

కాగా, తుని నియోజకవర్గం శృంగవృక్షం వద్ద కాకినాడ సెజ్ బాధిత రైతులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. 

రాష్ట్రంలో రానున్నది నిశ్శబ్ధ విప్లవం: Nara Lokesh

రాష్ట్రంలో రానున్నది నిశ్శబ్ధ విప్లవం అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయం, కాకినాడ సెజ్ కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారు. కాకినాడలోని సెజ్‌ రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చలేదని, రాబోయే టీడీపీ ప్రభుత్వం కాలుష్య రహిత యూనిట్లను మాత్రమే ఆహ్వానిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆదివారం అన్నారు. ఆదివారం యువ గళం పాదయాత్ర ప్రారంభించే ముందు లోకేష్ కాకినాడ సెజ్ రైతులతో ముచ్చటించారు. మూడు నెలలు ఓపిక పట్టండి, నేను ఇచ్చిన హామీలు అన్నీ నిలబెట్టుకుంటాను అని నారా లోకేష్( Nara Lokesh) అన్నారు.

ఉపాధి ఎంత ముఖ్యమో, కాలుష్యం కలిగించని కంపెనీలు తీసుకురావడం అంతే ముఖ్యం:లోకేష్

“రాబోయేది ప్రజా ప్రభుత్వం” అని నారా లోకేష్(Nara Lokesh)  అన్నారు. రైతులు ఎవరికైతే నష్ట పరిహారం అందలేదో వారికి నష్ట పరిహారం అందిస్తాం. కంపెనీల నుండి వచ్చే కలుషిత నీరు బయటకు రాకుండా శుద్ది చేస్తాం. ఎన్ని కోట్లు ఖర్చు అయినా అధునాతన టెక్నాలజీతో ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. “ఉపాధి ఎంత ముఖ్యమో, కాలుష్యం కలిగించని కంపెనీలు తీసుకురావడం అంతే ముఖ్యం” అని నారా లోకేష్ అన్నారు.

అధికారంలోకి రావడం లక్ష్యంగా ఆ రోజు జగన్ ఎకరానికి రూ.75 లక్షలు ఇస్తామని మోసం చేశాడు. నేను అలాంటి దొంగ హామీలు ఇవ్వను. సెజ్ రైతులు న్యాయం కోసం పోరాడితే వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం ప్రజలే చెబుతారన్నారు. రైతులకు భూమిపై అనుబంధం ఉంటుంది. ఈ భూములతో స్థానిక Y.S.R.C.P నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని, టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరించాలని లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.

రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తేస్తాం..

సెజ్ కి భూములు ఇవ్వని రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు అన్నింటినీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తివేస్తామని, ఆక్వా రంగానికి జోన్, నాన్ జోన్ అని సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50 కే అందిస్తామని, సెజ్ కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో వారికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

కాగా, వివిధవర్గాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని టిడిపి యువనేత నారా లోకేష్ కి వినతిపత్రాలు అందజేశారు.

తుని నియోజకవర్గం లో దెబ్బతిన్న వరిపొలాన్ని పరిశీలించిన లోకేష్

తుని నియోజకవర్గం ఒంటిమామిడి సమీపంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను లోకేష్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా, పంట నష్టపోయిన కౌలు రైతులు కాకాడ సత్యనారాయణ, యనమల వీరబాబు, ఎన్నా బాబ్జి మాట్లాడుతూ.. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. వారం రోజులు గడచినా తమ పొలాల వద్దకు వచ్చి చూసిన నాథుడు లేడని వాపోయారు. ఎకరాకు రూ.30వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, కష్టమంతా తుఫాను పాలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించకపోతే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని స్థానిక కౌలు రైతులు తెలిపారు.

సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళతాం: లోకేష్

ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో వెనువెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిసి CM హడావిడిగా బయటకొచ్చి తూతూ మంత్రపు పరామర్శలు చేశారన్నారు. పంటల బీమా సొమ్మును తామే చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 16 మంది రైతులకు మాత్రమే బీమా చెల్లించిందంటే రైతులపట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని నారా లోకేష్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని లోకేష్ చెప్పారు.

ALSO READ: మిచౌంగ్ తుఫాను ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: నారా చంద్రబాబు..