Home   »  రాజకీయం   »   competition | కేసీఆర్ మీద పోటీకి ఈటల జమున సై..

competition | కేసీఆర్ మీద పోటీకి ఈటల జమున సై..

schedule mounika

సీఎం కేసీఆర్ మీద పోటీ (competition)కి ఈటల జమున సిద్ధం అయ్యారు. గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం ఈటెల రాజేందర్ సతీమణి జమున దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా నిన్నటితో గడువు ముగిసింది.

మొత్తం 6,003 దరఖాస్తులు రాగా చివరిరోజు 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటెల రాజేందర్, గజ్వేల్ నుండి ఆయన సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు.

గజ్వేల్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తరఫున సతీమణి జమున దరఖాస్తు సమర్పించారు. దీంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తామంటూ గతంలో చాలాసార్లు ఈటల రాజేందర్‌ సవాల్ విసిరారు. తానే స్వయంగా కేసీఆర్‌పై పోటీ(competition) చేస్తానంటూ ప్రకటించారు.

ఇక గజ్వేల్‌ పరిధిలో ఈటల సొంత సామాజిక వర్గం ముదిరాజ్‌ ఓట్లు కూడా భారీగా ఉండడంతో తన సతీమణి జమున బరిలోకి దింపనున్నట్లు తెలుస్తుంది.

కాగా మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, హరీష్‌ రావు సహా పలువురు మంత్రులపై బీజేపీ తరఫున బలమైన అభ్యర్థులను పోటీ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇక మరోస్థానం కామారెడ్డిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను పోటీకి నిలపాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

అయితే కామారెడ్డిలో పోటీపై అరవింద్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. కేటీఆర్‌పై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ని పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావస్తున్నట్లు సమాచారం.

ఆయా చోట్ల బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్‌ ముఖ్యులను ఓడించినట్లు అవుతుందని.. ఒకవేళ బీజేపీ నేతలు ఓటమి పాలైనా తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌ ఇవ్వొచ్చని ఆలోచిస్తున్నట్లు సమాచారం.