Home   »  రాజకీయం   »   కాంగ్రెస్‌కు లీడర్‌ లేరు.. బిజేపీకి క్యాడర్‌ లేదు :హరీశ్‌రావు

కాంగ్రెస్‌కు లీడర్‌ లేరు.. బిజేపీకి క్యాడర్‌ లేదు :హరీశ్‌రావు

schedule raju

తెలంగాణ: సీట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహానికి ప్రతిపక్షాలు అతలాకుతలం అయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి క్యాడర్‌ లేదు… కాంగ్రెస్‌కు లీడర్‌ లేరని ఎద్దేవా చేశారు. సీటు దక్కని బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌, BJPలు ఎదురు చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని.. వాటిని కేంద్రం కాపీ కొట్టిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

అభ్యర్థుల కోసం అప్లికేషన్లు అమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లు ప్రజలకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. దాదాపు 35, 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరన్నారు. అందుకే అభ్యర్థుల వేట కోసం డబ్బు తీసుకుని దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పై సంపూర్ణ విశ్వాసం ఉందని, వరుసగా మూడోసారి గెలిపిస్తారని దీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోసారి సీఎం పీఠంపై కూర్చుంటారని హరీష్ రావు చెప్పుకొచ్చారు.