Home   »  రాజకీయం   »   Conspiracy |సోనియా గాంధీ వస్తుంటే.. కుట్రలా ?

Conspiracy |సోనియా గాంధీ వస్తుంటే.. కుట్రలా ?

schedule mounika

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, ఇచ్చిన సోనియా గాంధీ హైదరాబాద్ కు వస్తుంటే.. కుట్రలా(Conspiracy)?

ప్రధానాంశాలు:

  • సభ జరగకుండా కుట్రలు..
  • వంద రోజులు సోనియా దీక్ష చేయండి..
  • ఉచిత ఎరువుల హామీ ఏమైంది ?

సోనియా గాంధీ హైదరాబాద్ కు వస్తుంటే ప్రభుత్వం సహకరించి విజ్ఞతను ప్రదర్శించాల్సింది, కానీ దురదృష్టవశాత్తు విజ్ఞత, విజ్ఞానం కేసీఆర్ కు లేవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఈ నెల 17న తుక్కుగూడాలో నిర్వహించే విజయ భేరి సభా స్థలాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు. సభా ఏర్పాట్లు, ఇతర అంశాలపై నేతలకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. విజయ భేరి సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని చెప్పారు.

సభ జరగకుండా కుట్రలా(Conspiracy)..

కాంగ్రెస్ సభ జరిగితే బీఆర్ఎస్ పతనం ఖాయమని సభ జరగకుండా కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్ ను ఆడిగాం. కానీ బీజేపీ ప్రతిష్టను కాపాడుకునేందుకు కిషన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్ ను కాంగ్రెస్ కు ఇవ్వకుండా చేశారన్నారు. గచ్చిబౌలి స్టేడియంను అడిగినా స్పోర్ట్స్ అథారిటీ తిరస్కరించిందన్నారు.

ట్రాఫిక్ సమస్య లేకుండా తుక్కుగూడాలో ఖాళీ స్థలంలో నిర్వహించాలనుకున్నాం కానీ దేవాదాయ భూములు ఉన్నాయని అందులో అనుమతి నిరాకరించారు. అయినా తుక్కుగూడ రైతులు ముందుకొచ్చి కాంగ్రెస్ సభకు భూములు ఇచ్చారని తెలిపారు.

వంద రోజులు సోనియా దీక్ష చేయండి..

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల కోసం వంద రోజులు పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం
కేటాయించండి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

అయ్యప్ప, శివమాల ధారణలా కాంగ్రెస్ దీక్ష తీసుకుని, సోనియమ్మ మాల వేసుకుని కష్టపడాలన్నారు.

హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో టీపీసీసీ ఆధ్వర్యంలో జిల్లా, మండల, బ్లాక్ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్.. రాబోయే వంద రోజులు సోనియా దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఉచిత ఎరువుల హామీ ఏమైంది ?

2017 ఏప్రిల్ 13న ప్రగతి భవన్ సాక్షిగా తెలంగాణ రైతులకు ఇచ్చిన ఉచిత ఎరువుల సరఫరా హామీ ఏమైంది? అని రేవంత్ ప్రశ్నించారు. అన్ని హామీల మాదిరిగానే ఈ మాటకు దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు.

ఆరు నూరు అవుతుందేమో కానీ మీరు మాట మీరు మాట నిలబడరని మరోసారి రుజువైందన్నారు.

తెలంగాణలో ఉచిత ఎరువులు సంగతేమో కానీ, రైతులు పైసలిచ్చి కొందామనుకున్న ఎరువులు దొరక్క అల్లాడే పరిస్థితి నెలకొంది.

ఒక్కో రైతుకు 20 నుంచి 30 బస్తాలు అవసరం ఉండగా, కేవలం ఒకటి నుంచి ఐదు బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో రైతులు లబోదిబో మంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

యూరియా కొరత తీర్చాలని ప్రభుత్వాన్ని రేవంత్ కోరారు. లేదంటే.. రాష్ట్రంలోని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు దిగుతుందని హెచ్చరించారు.