Home   »  రాజకీయం   »   కాంగ్రెస్ హయాంలోనే దళిత సంక్షేమం: జీవన్ రెడ్డి

కాంగ్రెస్ హయాంలోనే దళిత సంక్షేమం: జీవన్ రెడ్డి

schedule mounika

TS: మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దళిత డిక్లరేషన్‌పై మంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దళిత సంక్షేమం జరిగిందని తెలిపారు. కేసీఆర్ సర్కార్ దళితులకు ఎన్ని ఇళ్లు నిర్మించిందో చెప్పాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లో తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్న ఊళ్లో కేసీఆర్ ఓటు అడగాలని పేర్కొన్నారు. దళితులకు మీరు ఒక్క ఇల్లు అయినా కట్టించారా, వాస్తవాలు చెబితే వినే ఓపిక లేదా, మీ వైఫల్యాలను ఎత్తిచూపుతే ఎందుకు భయం. బీఆర్ఎస్, కేసీఆరే అసలైన దళిత ద్రోహి అని పేర్కొన్నారు.