Home   »  రాజకీయం   »   గద్వాల్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ .. BRS లో చేరిన డీసీసీ అధ్యక్షుడు..

గద్వాల్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ .. BRS లో చేరిన డీసీసీ అధ్యక్షుడు..

schedule mounika

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ గద్వాల్ డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో BRS లో చేరారు.

కృష్ణమోహన్ రెడ్డి ని గెలిపించి గద్వాల్ అభివృద్ధిని కొనసాగిద్దాం :హరీశ్ రావు

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అవిభక్త మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. గద్వాల్ జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి బీఆర్‌ఎస్ పార్టీ వల్లే జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీతోనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. గద్వాల్ లో కృష్ణమోహన్ రెడ్డి ని గెలిపించి గద్వాల్ అభివృద్ధిని కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దొరకడం లేదన్నారు.

ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది : హరీశ్ రావు

CM KCR ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పేర్లు మార్చి హామీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని హరీశ్ రావు అన్నారు. “కాంగ్రెస్ పార్టీ హామీల హామీ” ఎవరిదని ప్రజలు అడుగుతున్నారన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో, హామీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ది గ్యారంటీ అని అన్నారు.

తెలంగాణలో BRS పార్టీ గెలుస్తుంది : పటేల్ ప్రభాకర్ రెడ్డి

పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో నాయకత్వ లోపం ఉందని, భారీ మొత్తాలకు టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి ఉందన్నారు. తెలంగాణలో BRS పార్టీ గెలుస్తుందని, అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్న నమ్మకంతోనే పార్టీలో చేరామన్నారు. పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ తో పాటు ఎంఐఎం కౌన్సిలర్ బంగి ప్రియాంక, బంగి సుదర్శన్, రఘు నాయుడు గద్వాల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, శ్రీకాంత్ గౌడ్ ధరూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, కెటి దొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమాదేవి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మాజీ జడ్పీటీసీ, పూల కర్ణాకర్ పలు కాంగ్రెస్ నేతలు BRS లో చేరారు.