Home   »  రాజకీయం   »   BJPని వీడే యోచనలో ఉన్న ఈటల రాజేందర్..?

BJPని వీడే యోచనలో ఉన్న ఈటల రాజేందర్..?

schedule raju

మాజీ ఎమ్మెల్యే, BJP సీనియర్ నేత ఈటల రాజేందర్ లోక్‌సభ ఎన్నికలకు ముందు BJPని వీడి కాంగ్రెస్‌లో చేరాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఈటల స్పందించారు.

Etela Rajender who is planning to leave BJP

హైదరాబాద్ | మాజీ ఎమ్మెల్యే, BJP సీనియర్ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) లోక్‌సభ ఎన్నికలకు ముందు BJPని వీడి కాంగ్రెస్‌లో చేరాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన ప్రత్యర్థి, కరీంనగర్ MP బండి సంజయ్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈటలకు కరీంనగర్ లోక్‌సభ టిక్కెట్‌ను ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈటల, బండిల మధ్య మాటల యుద్ధం

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకున్నందున, ఈ స్థానం నుంచి ఈటల వంటి ప్రముఖ నాయకుడు పోటీ చేస్తే సులువుగా విజయం సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది.

ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈటల, బండిల మధ్య మాటల యుద్ధం జరగడంతో BJP హైకమాండ్ సీరియస్ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నెలలో రాష్ట్ర పర్యటనలో ఇరువురు నేతలను హెచ్చరించి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర BJP చీఫ్‌ పదవి నుంచి బండిని తొలగించినప్పటి నుంచి ఈటలను టార్గెట్‌ చేసుకుని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన Etela Rajender

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈటల BJPని వీడి కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వచ్చినా ఆయన BJP లోనే ఉండి హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేశారు. అయితే, అయన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. దింతో ఈసారి ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, మల్కాజిగిరి లోక్‌సభ స్థానం కోసం ఈటల ప్రయత్నిస్తున్నారని, ఆయన తన ప్రణాళికను పార్టీ కేంద్ర నాయకత్వానికి ముందే చెప్పారని కూడా వార్తలు వచ్చాయి.

తాజాగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. తాను BJPని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. అయితే, తమ నాయకుడు BJPలో సంతోషంగా లేరని, త్వరలోనే ఆయన పార్టీని వీడాలని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు.

Also Read: MLC అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం..!