Home   »  రాజకీయం   »   MLC భూకబ్జా ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయి: ముత్తిరెడ్డి

MLC భూకబ్జా ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయి: ముత్తిరెడ్డి

schedule mounika

MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి భూ కబ్జాలన్నీ ఆధారాలతో సహా ఉన్నాయని MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా జనగామలో MLA యాదగిరిరెడ్డి ఆందోళన చేశారు. దళిత ద్రోహి పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎస్సీలపై పెట్టిన కేసులకు BRS తరఫున ముత్తిరెడ్డి క్షమాపణలు తెలిపారు. తాను ఎక్కడైనా భూకబ్జాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని విపక్షాలకు సవాల్ విసిరారు. BRS కేడర్ ను పల్లా రాజేశ్వర్ రెడ్డి అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.