Home   »  రాజకీయం   »   లోక్ సభ నుండి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ..?

లోక్ సభ నుండి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ..?

schedule mahesh

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి డబ్బు, బహుమతులు తీసుకున్నారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) లోక్‌సభ నుండి బహిష్కరణకు గురయ్యారు.

Mahua Moitra

లోక్ సభ నుండి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ M.P Mahua Moitra

లోక్‌సభ ఎథిక్స్ కమిటీ తన నివేదికను శుక్రవారం సభకు సమర్పించడంతో, ప్రభుత్వం ఆమెను బహిష్కరించాలని తీర్మానం చేసింది. వివిధ అంశాల్లో T.M.C ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) లోక్‌సభలో నిప్పులు చెరిగేవారు, అధికార బీజేపీ ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారు. తన వాగ్ధాటితో సభను ముగ్ధుల్ని చేసేవారు.

లోక్‌సభ లాగిన్ ఐడిని బయటి వ్యక్తులకు ఇచ్చిన ఆరోపణలపై బహిష్కరించిన లోక్ సభ

అయితే ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ ఆమె తన లోక్‌సభ లాగిన్ ఐడి , పాస్‌వర్డ్‌ను పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందానీకి ఇచ్చిందని, దాని ద్వారా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గురించి హీరానందనీ ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. అందుకోసం పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బు, ఖరీదైన బహుమతులు తీసుకున్నారనే మరో ఆరోపణ ఆమె పైన వుంది.

మొయిత్రాను బహిష్కరించాలని తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ఈ ఆరోపణలను B.J.P M.P నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముందుంచారు. స్పీకర్ ఓం బిర్లా ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశాలు జారీ చేసారు. ఈ కమిటీ తన నివేదికను శుక్రవారం లోక్‌సభకు సమర్పించింది. ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు కమిటీ సిఫార్సు చేసింది. ప్రభుత్వం వెంటనే ఆమెను బహిష్కరించాలని సభ ముందు తీర్మానం ప్రవేశపెట్టింది.

బహిష్కరణ ఫై మండిపడ్డ T.M.C, కాంగ్రెస్‌ పార్టీలు

నివేదికను అధ్యయనం చేసేందుకు కూడా సమయం ఇవ్వకపోవడంపై టీఎంసీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికార బీజేపీ ఫై మండిపడ్డారు. కనీసం తన వాదనను సభలో వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని T.M.C M.P కోరారు. కానీ స్పీకర్ అంగీకరించలేదు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఎవరికీ ఇవ్వకూడదనే నిబంధన లేదన్న మహువా మొయిత్రా

తనపై చేసిన ఆరోపణలు లోక్ సభ వెలుపల మీడియా ముందు మహువా మోయిత్రా స్పందించారు. లోక్ సభ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఎవరికీ ఇవ్వకూడదనే నిబంధన లేదన్నారు. పారిశ్రామికవేత్త దర్శన్ నుంచి డబ్బులు, బహుమతులు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. లోక్‌సభ నుంచి తమ పార్టీ ఎంపీని బహిష్కరించడంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.