Home   »  రాజకీయం   »   రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు..!

రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు..!

schedule vamshi

తమిళనాడు: ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ కి చెందిన CM కుమారుడు, క్యాబినెట్ మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) నుండి తమిళనాడు రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు చేస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు అయిన ఎంకే స్టాలిన్ NEET నుంచి రాష్ట్రానికి మినహాయింపు ప్రకటించాలని, ఈ నిరాహార దీక్షకు తన మద్దతు ఉంటుంది అని ప్రకటించారు. మరోవైపు నీట్‌ అంశాన్ని DMK పార్టీ రాజకీయం చేస్తోందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (BJP) విమర్శించింది.