Home   »  రాజకీయం   »   Fight | బీఆర్ఎస్-బీజేపీల మధ్య సినిమా ఫైట్..

Fight | బీఆర్ఎస్-బీజేపీల మధ్య సినిమా ఫైట్..

schedule mounika

బీఆర్ఎస్-బీజేపీల మధ్య ‘రజాకార్’ సినిమా ఫైట్(fight) షురూ అయింది. గత ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

1980-90లలో కశ్మీర్ పండిట్ల మారణ కాండ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

బీఆర్ఎస్-బీజేపీల మధ్య ఫైట్(fight)..

బీఆర్ఎస్-బీజేపీల మధ్య ‘రజాకార్’ సినిమా ఫైట్(fight) ట్విట్టర్ వేదికగా KTR వర్సెస్ బండి సంజయ్ గా కొనసాగుతుంది. ఈ చిత్రానికి వివేక్ అగ్ని దర్శకత్వం వహించారు. కాశ్మీర్ ఫైల్స్ తరహా రజాకార్ ఫైల్స్ ని కూడా తీసుకొస్తామని తెలంగాణ బీజేపీ నేతలు పదే పదే చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసింది. “రజాకార్” టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కాశ్మీర్ పైల్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా రజాకార్ చిత్రం ఉండబోతుందని టీజర్ తో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఊహించినట్టుగానే ఈ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

రజాకార్ ట్రైలర్ పై స్పందించిన మంత్రి కేటీఆర్… బిజెపికి చెందిన కొంతమంది మేధావి దివాళాకోరు జోకర్లు తెలంగాణలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింస మరియు ధ్రువణాన్ని ప్రేరేపించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు.

అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ మంత్రి కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు ట్రాక్ మార్చిందని ఆరోపించారు. రజాకార్లు దాష్టికాలను చూపించగానే KTR కు సమస్యగా మారిందని మండిపడ్డారు.

ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. రజాకార్ల హిందూ మారణహోమాన్ని చూపించిన సినిమా పై దాడికి సిద్ధమయ్యారని కేటీఆర్ పై విమర్శలు చేశారు. చరిత్రను తుడిచిపెట్టే పనికి మాలిన ప్రయత్నాలకు బదులు కేటీఆర్ కు కొంత స్పృహను కలిగించాలని అందరూ గణనాథుడిని ప్రార్థిద్దాం అని చురకలంటించారు.