Home   »  రాజకీయం   »   మంత్రి కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి

schedule mahesh

Jagadish Reddy | అధికార కాంగ్రెస్‌ పార్టీపై మాజీ మంత్రి, సూర్యాపేట MLA జగదీష్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. పూటకో తీరు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన ఫైర్ అయ్యారు.

former-minister-jagadish-reddy-got-angry-with

Jagadish Reddy | అధికార కాంగ్రెస్ పార్టీ, మంత్రి కోమటి రెడ్డిపై మాజీ మంత్రి, సూర్యాపేట MLA జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. పూటకో తీరు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నామన్న సోయి లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై ఘాటుగా ఆయన స్పందించారు. సోమవారం BRS భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాటం సిగ్గు చేటన్నారు.

మంత్రి కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి

కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారు. హామీల అమలును ప్రశ్నిస్తే ఇప్పుడు వారికి కోపమొస్తుందన్నారు. మా మీద కోపం ఉంటే పగ తీర్చుకోండి కానీ రాష్ట్రానికి నష్టం చేసే పనులు చేయద్దని అయన కోరారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకు తెలియదన్నారు.

నవంబర్ నుండి కరెంటు బిల్లులు కట్టవద్దని కోమటిరెడ్డి చెప్పిన దాన్నే KTR చెప్పారన్నారు. KTR నిజం చెబితే కోమటిరెడ్డి చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కోమటి రెడ్డిని కాంగ్రెస్‌లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ BJP అభ్యర్థి తన తమ్ముడికి ఓట్లేయమని చెప్పింది కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాదా అని అన్నారు. BRS ను 39 ముక్కలు చేస్తా అంటున్నారు. అది కోమటి రెడ్డి తాత తరం కూడా కాదని జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు.

రైతుబంధు రాక రైతులు ఆందోళన చెందుతున్నారన్న Jagadish Reddy

యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్లీ వచ్చాయన్నారు. కాంగ్రెస్ నేతలు ముందుగా ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటికీ రైతుబంధు రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు పెరిగాయి. కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు BRS ఉంటుందని తెలియజేసారు.

Also Read | ఇకపై అయోధ్యలో కాల్పులు, కర్ఫ్యూలుండవన్న UP CM