Home   »  రాజకీయంవార్తలు   »   తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు చేయూత .మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు చేయూత .మంత్రి కేటీఆర్

schedule mounika

తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు చేయూతనందించేది కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని, మిగతా ఎక్కడా లేదని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి జిల్లా పోచంపల్లిలో శనివారం మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఔత్సాహిక యువ చేనేత కళాకారుడు సైని భగత్ ఏర్పాటు చేసిన కళా పునర్వి చేనేత యూనిట్ ని కేటీఆర్ ప్రారంభించారు.

చేనేతలను కాపాడడంతో పాటు నేతన్నలకు భారీగా ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్ ని ఏర్పాటు చేసిన భగత్ బృందానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. ఒకవైపు ప్రధానమంత్రి నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం అన్నింటిని అమ్మి చేనేతలను ఇబ్బంది పాలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు.

పోచంపల్లి చేనేత పార్క్ ని పునరుద్ధరించి ఇక్కడి నేతన్నలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్టైల్ క్లస్టర్ మాదిరి పోచంపల్లి నేతన్నలు కలిసి పోచంపల్లి చేనేతల అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.