Home   »  రాజకీయం   »   కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉపాధి రేటులో అగ్రస్థానంలో కొనసాగించాలి : వినోద్ కుమార్

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉపాధి రేటులో అగ్రస్థానంలో కొనసాగించాలి : వినోద్ కుమార్

schedule mounika

హైదరాబాద్‌: గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉపాధి రేటులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని, అదే స్ఫూర్తిని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించాలని ప్లానింగ్‌ బోర్డు మాజీ వైస్‌ చైర్మన్‌ B. వినోద్‌కుమార్‌(Vinod Kumar) కోరారు.

Vinod Kumar

85.45 శాతంతో తెలంగాణ అత్యధిక ఉపాధి కల్పన సామర్థ్యాన్ని కలిగి ఉంది: Vinod Kumar

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నందున దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత తెలంగాణకు వస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు. 85.45 శాతంతో తెలంగాణ అత్యధిక ఉపాధి కల్పన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత B.R.S ప్రభుత్వానికే దక్కుతుంది: వినోద్ కుమార్

డిగ్రీ, M.B.A, B.Tech తదితర ఉన్నత చదువులు చదివిన యువత ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని అవకాశాలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. అనేక విదేశీ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత B.R.S ప్రభుత్వానిదేనన్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, ఇతర రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం T-హబ్‌, T- వర్క్స్ లను ప్రారంభించిందని, ఫలితంగా అనేక ఆవిష్కరణలు వచ్చాయని వినోద్‌కుమార్‌ గుర్తు చేశారు.

IT టవర్లను B.R.S ప్రభుత్వం ఏర్పాటు చేసింది: వినోద్ కుమార్

రాష్ట్రంలోని టైర్-2 పట్టణాల్లో IT టవర్లను B.R.S ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పాత, కొత్త తెలంగాణ అని పోల్చుకునే విధానంగా బీఆర్‌ఎస్‌ తెలంగాణను తయారు చేసిందని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

ALSO READ: తెలంగాణ భవన్ వేదికగా “ స్వేద పత్రం ” పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాం: KTR