Home   »  రాజకీయం   »   రాహుల్ గాంధీకి స‌వాల్ విసిరిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!

రాహుల్ గాంధీకి స‌వాల్ విసిరిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!

schedule mahesh

Union Minister Smriti Irani | రాహుల్ గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నియోజకవర్గాన్ని వదిలి కేవలం అమేథీలో మాత్రమే పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.

it-was-smriti-irani-who-challenged-rahul

Union Minister Smriti Irani | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నియోజకవర్గాన్ని వదిలి కేవలం అమేథీలో పోటీ చేయాలని ఆమె అన్నారు.

గతంలో Union Minister Smriti Irani చేతిలో ఓడిన రాహుల్

ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌కు ఆత్మవిశ్వాసం ఉంటే వయనాడ్ నుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదని, అమేథీ నుంచి మాత్రమే పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఛాలెంజ్ చేయడం జరిగింది. గతంలో రాహుల్ గాంధీ UPలోని అమేథీ స్థానం నుంచి పోటీచేసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూసారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీ 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీ చేసి గెలుపొందారు. ఆ స్థానం నుంచి 4.3 లక్షల ఓట్ల తేడాతో రాహుల్ గెలుపొందారు.

గతంలో అమేథీ నుంచి మూడుసార్లు గెలిచిన రాహుల్

కాగా రాహుల్ గాంధీ గతంలో అమేథీ నుంచి మూడుసార్లు గెలిచారు. 2004 నుంచి ఆ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్న రాహుల్ 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారా లేక వయనాడ్ నుంచి పోటీ చేస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు.

Also Read | రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన అస్సాం CID..!