Home   »  రాజకీయం   »   Jamili elections |జమిలి ఎన్నికల వెనుక భారీ కుట్ర: ప్రశాంత్ భూషణ్

Jamili elections |జమిలి ఎన్నికల వెనుక భారీ కుట్ర: ప్రశాంత్ భూషణ్

schedule mahesh

Newdelhi: కేంద్రం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే దేశం-ఒకే ఎన్నికల పేరుతో జపం చేస్తోంది. Jamili elections నిర్వహణ ద్వారా భారీ ఎత్తున వ్యయం, సమయం ఆదా అవుతుందని నమ్మబలుకుతోంది.

కానీ ఈ ప్లాన్ వెనుక అంతకుమించిన భారీ వ్యూహం దాగి ఉందనే ప్రచారం జాతీయ స్ధాయిలో జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో లాయర్ ప్రశాంత్ భూషణ్ కీలక వివరాలు వెల్లడించారు.

ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆయన ఇవాళ ఆరోపించారు.

వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ పై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు

ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ అంశంపై కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు.

ఈ ఏడాదిలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. 

ఆయా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని అలాగని ఎన్నికలు నిర్వహించి ఓడిపోతే ఈ ప్రభావం వచ్చే ఏడాది జరుగబోయే

లోక్‌ సభ ఎన్నికల పై పడడం ఖాయమని భావించి ఎలాగైనా ఈ ఐదురాష్ట్రాల ఎన్నికలను వచ్చే ఏడాదికి వాయిదా వేసి దేశవ్యాప్తంగా Jamili elections నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో మధ్యలో ఓ ప్రభుత్వం మెజార్టీ కోల్పోతే కుప్పకూలుతుందని అటువంటప్పుడు జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ఎలాంటి లాభం ఉండబోదని ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు.

అలాగే జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుందని అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు.

అదే జరిగితే మనం ప్రజాస్వామ్యం నుంచి అధ్యక్ష తరహా పాలన వైపు మళ్లాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణకు సిద్ధమవుతోందన్నారు.

ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమవుతోందన్న ఆయన తన దృష్టిలో ప్రభుత్వానికి దీని పై పూర్తి అవగాహన ఉందని తెలిపారు.

రాజ్యసభలో ప్రస్తుత ప్రభుత్వానికి మెజారిటీ లేదని ఆ విషయం తెలిసే జమిలి ఎన్నికల వ్యూహానికి సిద్ధం అవుతుందని ఆరోపించారు.

ఐదు రాష్ట్రాల్లో ఓటమి భయం ప్రభుత్వానికి ఉందని అందుకే ఎన్నికలు వాయిదా వేసి సార్వత్రిక ఎన్నికలతో కలిపి రెండు ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనే ఉద్దేశం ఉందన్నారు.

అప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రశాంత్‌ భూషణ్‌ వివరించారు.