Home   »  రాజకీయం   »   జమిలి ఎన్నికలు వచ్చినా సిద్ధమే: మంత్రికొప్పుల

జమిలి ఎన్నికలు వచ్చినా సిద్ధమే: మంత్రికొప్పుల

schedule mounika

తెలంగాణ: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. 115 మంది అభ్యర్థులతో తాము జాబితా విడుదల చేసుకోవడం తమ ఎన్నికల సంసిద్ధతకు నిదర్శమని తెలిపారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, జమిలి ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని ప్రకటించారు. కేంద్రానికి బీఆర్ఎస్ మద్దతు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ పథకాలకు కాపీ కొట్టి ఎదో చేస్తామని కాంగ్రెస్ భ్రమలు కల్పిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలోకి వచ్చి, మరింత సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తామన్నారు. ఎనిమిదేళ్లలో దళిత బంధు అన్ని దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదనేది దుష్ప్రచారం మాత్రమే. ఎన్నికలు ఎలా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ,ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్‌ తెలంగాణలో కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా ఈ డిక్లరేషన్ విడుదల చేయాల్సి ఉండేదన్నారు. మంత్రికొప్పుల జమిలి ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని ప్రకటించారు.