Home   »  రాజకీయం   »   Jamili |జమిలి ఎన్నికల సమావేశం ప్రారంభం

Jamili |జమిలి ఎన్నికల సమావేశం ప్రారంభం

schedule mahesh

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన Jamili ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ జమిలి ఎన్నికల కమిటీ తొలిసారిగా సమావేశమైంది.

ఈ కమిటీ లో కేంద్రమంత్రులు అమిత్‌ షా, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌తో సహా ఇతర నేతలు హాజరయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి కమిటీలో ఉండబోనని ప్రకటించి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను ఈ భేటీలో చర్చించనున్నారు. Jamili ఎన్నికలకి సంబందించిన కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే దేశంలోనే చాల పార్టీలు జమిలి ఎన్నికలని వ్యతిరేకిస్తుండగా అదే బాటలో CPM పార్టీ కూడా జమిలి ఎన్నికలకు వ్యతిరేకం అని CPM పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు.

దేశానికి బిజేపీ విచ్చిన్నకర శక్తిగా మారిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు
ఆరోపించారు.

బిజేపీని ఓడించడమే వామపక్షాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా
తాడేపల్లిలో ప్లీన
రీ సమావేశంలో మాట్లాడిన ఆయన జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని
తెలిపారు.

దేశం పేరును మార్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బిజేపీతో TDP, జనసేన కలిసి ఉన్నంత కాలం వారితో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

BJP దేశంలో మత విధ్వేషాలని రెచ్చగొడుతూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన అన్నారు

ఇప్పటికే జమిలి ఎన్నికల పైనా ప్రతి పక్ష కాంగ్రెస్, INDIA కూటమిలో వున్నా పార్టీలు, తెలంగాణ లోని BRS పార్టీ తో సహా ఇంకా దేశంలోని చాలా పార్టీలు జమీలి ఎన్నికలని వ్యతికిస్తున్నాయి.

అంతే కాకుండా అధికార NDA ప్రభుత్వం మళ్ళి 3సారి అధికారంలోకి రావడానికే ఈ జమిలి ఎన్నికల రూపంలో కుట్ర పన్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

అంతే కాకుండా INDIA పేరుని BHARTH గా మార్చడం ఫై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. రానున్న ప్రత్యేక సమావేశాలలో ప్రధానంగా జమిలి ఎన్నికల పైనా, ఇండియా పేరు మార్పు, మహిళా రిజర్వేషన్ పై చర్చలు జరిగేలా కనిపిస్తున్నాయి.