Home   »  రాజకీయం   »   Janasena party |తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగనున్న జనసేన.

Janasena party |తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగనున్న జనసేన.

schedule mounika

రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు మరో పార్టీ రెడీ అవుతుంది. సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ(Janasena party )కూడా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేయనున్నట్టు జనసేన పార్టీ (Janasena party) ప్రకటించింది. ఈ మేరకు పోటీచేసే స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం విడుదల చేసింది.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యం..

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని జనసేన తెలంగాణ శాఖ పేర్కొంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నద్ధతతో ఉన్నామని.. ఈసారి పోటీలో ఉంటున్నట్టు జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి తెలిపారు. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఈ స్థానాల్లో మార్పులు ఉండొచ్చని అన్నారు.

జనసేన పార్టీ(Janasena party )పోటీచేసే స్థానాల జాబితా..

కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పాతచెరు, సనత్ నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్‌లలో జనసేన పోటీ చేస్తుందని పార్టీ విడుదల చేసింది. నక్రేకల్, హుజూర్‌నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పలియార్, ఎల్లందు, మధిర అసెంబ్లీ సెగ్మెంట్లు. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ని స్థాపించారని అన్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే నాయకత్వాన్ని తయారు చేసినట్టు మహేందర్ రెడ్డి చెప్పారు. దాదాపు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని పేర్కొన్నారు..తెలంగాణలో ఆంధ్రా ఓటర్లు అధికంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్లు నేతలు తెలిపారు.