Home   »  రాజకీయం   »   Kavitha :తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, వారి వాగ్దానాలను ఎప్పటికీ నమ్మరు.

Kavitha :తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, వారి వాగ్దానాలను ఎప్పటికీ నమ్మరు.

schedule mounika

హైదరాబాద్: . తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, వారి వాగ్దానాలను ఎప్పటికీ నమ్మరని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత(Kavitha)అన్నారు.

తెలంగాణతో గాంధీ కుటుంబానికి ఉన్న ఏకైక బంధం ఉంది అంటే..అది నమ్మకద్రోహం: కవిత

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత మాట్లాడుతూ..తెలంగాణ తో గాంధీ కుటుంబానికి ఉన్న ఏకైక బంధం ఉంది అంటే..అది నమ్మకద్రోహంతో కూడిన అబద్ధం మాత్రమే అని కవిత అన్నారు.తెలంగాణతో గాంధీ కుటుంబానికి ద్రోహం, వెనుకబాటుతనం అనే రీతిలో సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 1950వ దశకంలో తెలంగాణను ఆంధ్రాలో బలవంతంగా విలీనం చేసింది మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని, 1969లో ప్రత్యేక తెలంగాణను నిరాకరించడం వల్ల పోలీసు కాల్పుల్లో 369 మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె అన్నారు.

పదేళ్లలో రాహుల్ గాంధీ తెలంగాణకు మద్దతుగా ఎప్పుడూ మాట్లాడలేదు :Kavitha

అలాగే, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత వెనక్కి తగ్గారని, దీంతో చాలా మంది చనిపోయారని ఆమె అన్నారు. గత పదేళ్లలో రాహుల్ గాంధీ తెలంగాణకు మద్దతుగా ఎప్పుడూ మాట్లాడలేదని రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.