Home   »  రాజకీయం   »   సంచలనం సృష్టించిన కేసీఆర్‌…. ఒక్కరోజులోనే…..!

సంచలనం సృష్టించిన కేసీఆర్‌…. ఒక్కరోజులోనే…..!

schedule sirisha

తెలంగాణ రాష్ట్ర సాధన అనే మహోద్యమంలో మహా విజయం సాధించిన CM KCR. రెండు ఎన్నికల్లో సంపూర్ణ ఆధిక్యం, ఒకదాని కంటే మరొకటి మిన్నగా పదేండ్లు గడిచాయి. మూడో ఎన్నిక ముంగిట నిలిచిన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలనం సృష్టించారు. మొత్తం 119 స్థానాల్లో, 115 సీట్లకు ఒక్కరోజే, ఒక్కసారే, ఏకబిగిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని ప్రకటించి కేసీఆర్‌ సంచలనం సృష్టించారు.

అంతేకాదు, మొత్తం 105 మంది సిట్టింగుల్లో 98 మందికి మళ్లీ టికెట్లు ఇచ్చి, ఇదీ నా సత్తా కాస్కోండి అంటూ సవాల్‌ విసిరారు. “లొట్టిపిట్ట పెదవులకు నక్క ఆశపడ్డట్టు“, బీఆర్‌ఎస్‌ సిట్టింగులకు టికెట్లు నిరాకరిస్తే, వారిని చేర్చుకుందామని ఎదురుచూస్తున్న విపక్షాల ఆశలపై నీళ్లు గుమ్మరించారు. చేరికల కమిటీలు ఇక రద్దు చేసుకుంటే మంచిదేమో! అని కేసీఆర్ ధీటుగా సమాధానం చెప్పకనే చెప్పారు.