Home   »  రాజకీయం   »   Kesineni Nani: టీడీపీ నుంచే ఎంపీగా పోటీ చేస్తా

Kesineni Nani: టీడీపీ నుంచే ఎంపీగా పోటీ చేస్తా

schedule raju

విజయవాడ MP కేశినేని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి లేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) కొనియాడారు.

ప్రధానాంశాలు:

  • టీడీపీని వీడేది లేదని, వచ్చే ఎన్నికల్లోను ఇదే పార్టీ నుండి పోటీ చేస్తానని స్పష్టీకరణ
  • వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి లోక్ సభకు వెళ్తానని ధీమా
  • చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చ లేని నాయకుడని కితాబు

ఆంధ్రప్రదేశ్: తాను TDPలోనే ఉన్నానని.. ఆ పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు. తన ఐడియాలజీ కూడా టీడీపీనే అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ అభ్యర్థిగా మూడోసారి ఆ పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో పార్లమెంట్‌లో అడుగు పెడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నోటీసులు అనేది పెద్ద ఇష్యూకాదని.. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పుకునే నిబద్ధత ఆయనకు ఉందని చెప్పారు.

Also Read: ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం ఎందుకు?: సజ్జల

ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్లలో ఏకత్వ ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. కృష్ణా జిల్లాలోని కింది స్థాయి టీడీపీ నేతలపై ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Ambati Rambabu: ఏమైపోయావ్ “బ్రో’.. పవన్‌పై అంబటి సెటైర్లు

టీడీపీ 40ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో క్రింది స్థాయి నాయకులను ఇప్పటికీ కూడా చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లకపోవడం దురదృష్టకరం అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని రాజకీయంగా ఎదకుండా ఈ ప్రాంత నాయకులు వాడుకోని వదిలేశారు అని ఆరోపించారు. రాజకీయాల్లో ప్రజాసేవ మాత్రమే ముఖ్యం….. పదవులు ముఖ్యం కాదన్నారు. కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పుకొచ్చారు. మరోవైపు పార్టీల మధ్య పోత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుంది అని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.