Home   »  రాజకీయం   »   KTR :ఓటుకు నోటు కేసులో డబ్బు కట్టలతో అడ్డంగా దొరికిన వ్యక్తితో మనకు పోటీనా ?

KTR :ఓటుకు నోటు కేసులో డబ్బు కట్టలతో అడ్డంగా దొరికిన వ్యక్తితో మనకు పోటీనా ?

schedule mounika

భూపాలపల్లి : ఓటుకు నోటు కేసులో డబ్బు కట్టలతో అడ్డంగా దొరికిన వ్యక్తితో మనకు పోటీనా అని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు.

సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే గృహలక్ష్మి, దళిత బంధు పథకాలతోపాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలి బహిరంగ సభ..

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బీఆర్ఎస్ (భూపాలపల్లి రాష్ట్ర సమితి) తొలి బహిరంగ సభకు కూడా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సుభాష్ కాలనీ ఏరియాలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. KCR ఇంట్లో ఉన్నా ప్రజలకు సేవ చేయడంలో సీఎం కేసీఆర్ చురుగ్గా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని ప్రకటనలు చేస్తానని ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మొన్న ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకో రేటు: KTR

మొన్నటి వరకు రాహుల్ గాంధీని ముద్దపప్పు అని, సోనియా గాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు వారికి ఓట్లు వేయాలని అంటున్నాడు. ఎటు పడితే అటు మాట్లాడే ఆయనను నమ్ముదామా? మొన్న ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకో రేటు.. అందుకే ఆయనను రేవంత్ రెడ్డి అనడం లేదు.. రేటెంత రెడ్డి అంటున్నారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయం అని KTR అన్నారు.

కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు తప్పవు..

ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ఎత్తిచూపారు. కాంగ్రెస్ పార్టీ తమ విజయాలను తక్కువ అంచనా వేయవద్దని, అధికారంలో ఉన్న సమయంలో తమ సొంత విజయాలను ప్రదర్శించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు తప్పవని KTR తెలిపారు.