Home   »  రాజకీయం   »   Harish Rao | నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో BRS సన్నాహక సమావేశం..

Harish Rao | నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో BRS సన్నాహక సమావేశం..

schedule mounika

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో BRS సన్నాహక సమావేశం జరిగింది. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమీక్షకు పెద్ద ఎత్తున హాజరైన అందరికీ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత నెలరోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించామన్నారు.

Harish Rao

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో BRS సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత నెలరోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించామన్నారు. ఇది పదకొండో మీటింగ్, ఇప్పటి దాకా జరిగిన అన్ని సమావేశాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువగా విలువైన సూచనలు వచ్చాయన్నారు. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందన్నారు. పార్టీ మీ అభిప్రాయం మేరకే పని చేస్తుంది అని హరీష్ రావు తెలిపారు.

“మన పార్టీ స్థానం మారింది.. పాలన నుంచి ప్రతి పక్షానికి వచ్చాం”: Harish Rao

మన పార్టీ స్థానం మారింది.. పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చామన్నారు. అయినా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. “మనం ఉద్యమ వీరులం, కార్య శూరులం, ఉద్యమానికి ఊపిరిలూదిన వాళ్ళం. పేగులు తేగే దాకా మన మాతృ భూమి కోసం కొట్లాడిన వాళ్ళం, మనకు సత్తువ ఉంది, సత్తా ఉంది. ప్రతిపక్షంలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదాం” అని హరీష్ రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదన్నారు. ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదన్నారు.

రాజస్థాన్ లో ఐదేళ్లకే ప్రభుత్వం మారింది, ఛత్తీస్ ఘడ్ లో కూడా ఐదేళ్లకే మారింది. ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదన్నారు. ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలి. మన బడ్జెట్ ఎంత? 2 లక్షల 90 వేల కోట్లు.. బడ్జెట్ కన్నా మించి కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చారన్నారు.

కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది: Harish Rao

ఎలాగూ అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రాసేశారు, కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికలపుడు ఇష్టమొచ్చిన విధంగా ప్రజలను మభ్యపెట్టి ఇపుడు వాటి గురించి మనం అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారన్నారు. హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారన్నారు.

కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందన్నారు. 5 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని కర్ణాటక ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి మొన్న మీడియాతో చెప్పారన్నారు. గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని ఆయన హెచ్చరించారన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో BRS సత్తా చాటుదాం: హరీష్ రావు

“రాజకీయాలకతీతంగా KCR తెలంగాణను అభివృద్ధి చేశారని, ఇది ఎవరూ కాదనలేని సత్యం” అని హరీష్ రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో BRS గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం ఉంటుందన్నారు. ఈ కీలక సమయంలో BRS MPలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. “అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠంగా నేర్చుకుని ముందుకు సాగుదాం” అని హరీష్ రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో BRS సత్తా చాటుదామని హరీష్ రావు అన్నారు.

ALSO READ: ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం BRSకు లేదన్న వినోద్‌ కుమార్‌