Home   »  రాజకీయం   »   కోలమూరు లో లోకేశ్ … 24 గంటలు తాగునీరు అందిస్తామని హామీ

కోలమూరు లో లోకేశ్ … 24 గంటలు తాగునీరు అందిస్తామని హామీ

schedule raju

ఆంధ్రప్రదేశ్: లోకేశ్‌ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం 204వ రోజు పాదయాత్రను ఉండి మండలం కోలమూరు నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలమూరు గ్రామస్తులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని.. మురికి నీరు తాగడంతో అనారోగ్య సమస్య ఎదురువుతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… కేంద్రం కేటాయించిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ నిధుల వినియోగంలో YCP ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ‘వాటర్‌ గ్రిడ్‌’ ద్వారా 24 గంటలు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిన CM జగన్‌ ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అందిస్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని రాష్ట్రంలో జె .బ్రాండ్ల మద్యం నిషేధిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.