Home   »  రాజకీయం   »   Manjula Reddy |బీజేపీలోకి కర్ణకంటి మంజులా రెడ్డి..

Manjula Reddy |బీజేపీలోకి కర్ణకంటి మంజులా రెడ్డి..

schedule mounika

సామాజిక సేవకురాలిగా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా పేరు గాంచిన కర్ణకంటి మంజుల రెడ్డి (Manjula Reddy) మూడు రోజుల్లో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. పేద కుటుంబాల్లో ఏదైనా ఆపద వస్తే నేనున్నానని తన వంతు సాయం చేస్తూ నియోజవర్గ ప్రజల మన్ననలు పొందుతోంది.

బీజేపీలోకి మంజులా రెడ్డి(Manjula Reddy):

రాబోయే మూడు రోజుల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కాషాయపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి హుస్నాబాద్ బరిలో నిలవబోతున్నట్లు మంజుల రెడ్డి చెబుతోంది.

హుస్నాబాద్ బీజేపీలో త్రిముఖ పోరు..

ఇప్పటికే బీజేపీలో చేరిన జన్నపురెడ్డి సురేందరెడ్డి, బొమ్మశ్రీరామ్ చక్రవర్తి హుస్నాబాద్ నియోజకవర్గంలో పాగా వేశారు. కాగా కర్ణకంటి మంజుల రెడ్డి సైతం బీజేపీలో చేరబోతుండటంతో హుస్నాబాద్ బీజేపీలో త్రిముఖ పోరుతప్పేలా లేదు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నా బాద్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా ఉండనున్నాయి. హుస్నాబాద్ బీజేపీలో త్రిముఖ పోరు ఉండనుంది.

పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో..

నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలతో కర్ణకంటి మంజుల రెడ్డి, జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి ప్రజల్లో నిత్యం నిలుస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి (Shri Ram Chakravarty) సైతం తన వర్గంతో నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు.

కాగా రానున్న ఎన్నికల్లో హుస్నాబాద్ బీజేపీ టికెట్ ఈ ముగ్గురిలో ఎవరికి కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.

ఇప్పటికే అభ్యర్థుల నుంచి నియోజకవర్గ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ నియోజవర్గం నుంచి ఎవరెవరు దరఖాస్తులు సమర్పిస్తున్నారో తెలియాల్సి ఉంది.

హుస్నాబాద్ BJP టికెట్ ఎవరికి కేటాయిస్తుందో అనే ఉత్కంఠ..

ఇదిలా ఉండగా కర్ణకంటి మంజుల రెడ్డికి హుస్నాబాద్ బీజేపీ టికెట్ కేటాయిస్తే ఘన విజయం తథ్యమని మంజుల అక్క యువసేన సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

అయితే బీజేపీ అధిష్ఠానం హుస్నాబాద్ టికెట్ ఎవరికి కేటాయిస్తుందో అనే ఉత్కంఠ నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొని ఉంది.