Home   »  రాజకీయం   »   ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: మంత్రి పొంగులేటి..

ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: మంత్రి పొంగులేటి..

schedule mounika

ఖమ్మం జిల్లా: ఉద్యోగులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేశారో, ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటన్నిటిపై సమీక్షలు చేసి సరిదిద్దుతామని అభివృద్ది, సంక్షేమంపై రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఉద్యోగులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేశారో, ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటన్నిటిపై సమీక్షలు చేసి సరిదిద్దుతామని అభివృద్ది, సంక్షేమంపై రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

అధికారులను వేధించటానికి సమీక్ష నిర్వహించలేదు : మంత్రి

సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిద్దిద్దటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలందాలని అధికారులను కోరినట్లు తెలిపారు. అధికారులను వేధించటానికి సమీక్ష నిర్వహించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas reddy) అన్నారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రెండ్లీ ప్రభుత్వం: Minister Ponguleti Srinivas reddy

సంక్రాంతి పండుగకు మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ప్రజల కోసం చిత్తశుద్దితో పని చేసే అధికారులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష పార్టీ నేతలు ఇంకా అధికారంలోనే ఉన్నామని కలలు కంటున్నారు: మంత్రి

ఉద్యోగులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ (BRS) నేతలు రంకెలేస్తున్నారని, ఇంకా అధికారంలోనే ఉన్నామని కలలు కంటున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు చెబుతున్నా మీలా మేం మాయమాటలు చెప్పం, మీలా ప్రజలను మోసం చేయం ధనిక రాష్ట్రం తెలంగాణను గత ప్రభుత్వం కొల్లగొట్టింది, ఖజానా ఖాళీ చేసింది అని మండిపడ్డారు.

జర్నలిస్టులకూ న్యాయం చేస్తాం: మంత్రి

ఇది ఇందిరమ్మ రాజ్యమని.. ప్రజా రాజ్యమని, జర్నలిస్టులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సామాన్య ప్రజలకు అభివృద్ది ఫలాలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నామని, ధరణి పేరుతో జరిగిన దోపిడీని బట్టబయలు చేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.

ALSO READ: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే: మంత్రి శ్రీధర్ బాబు