Home   »  రాజకీయం   »   కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో మాయమాటలు చెబుతోంది: హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో మాయమాటలు చెబుతోంది: హరీశ్‌రావు

schedule mounika

ఆరు హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో మాయమాటలు చెబుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (MLA Harish Rao) ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంపై లఘు చర్చలో హరీశ్ రావు మాట్లాడారు.

MLA Harish Rao

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంపై లఘు చర్చలో హరీశ్ రావు మాట్లాడారు.

శ్వేతపత్రం తయారీ వెనుక A.Pకి చెందిన రిటైర్డ్‌ I.A.S అధికారి ఉన్నారు:హరీశ్‌రావు

ముఖ్యమంత్రి గారి పాత గురువు శిష్యులు కలిసి శ్వేతపత్రాన్ని తయారు చేశారని హరీశ్ రావు ఆరోపించారు. ఈ శ్వేతపత్రం తయారీ వెనుక A.Pకి చెందిన ఓ రిటైర్డ్‌ I.A.S అధికారి ఉన్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు పేర్లు కూడా బయటపెడతామన్నారు.అయితే దీనిపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆరోపణలను ఖండించారు.

తెల్లకాగితంలో అప్పులు చూపి ఆదాయం ఎలా పెరిగిందో చెప్పకపోవడం సరికాదు: MLA Harish Rao

కేవలం తెల్లకాగితంలో అప్పులు చూపి ఆదాయం ఎలా పెరిగిందో చెప్పకపోవడం హరీశ్ రావు సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.

తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ :హరీష్ రావు

కరోనా, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణకు లక్ష కోట్ల అదనపు రుణభారం పడిందన్నారు. దేశ GDP కి ఎక్కువ సహకారం అందిస్తున్న మొదటి 5 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని హరీష్ రావు పేర్కొన్నారు. తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు.

ALSO READ: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన మల్లు భట్టి విక్రమార్క ..